జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన -4వేల రెండు కేసుల్లో రూ.కోటి కి పైగా రికవరీ

Published: Monday June 27, 2022
మంచిర్యాల బ్యూరో , జూన్ 26, ప్రజాపాలన:
 
మంచిర్యాల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.సత్తయ్య అధ్యక్షతన సోమవారం జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు బారీ స్పందన వచ్చింది. న్యాయమూర్తి ఆదేశాలతో న్యాయసేవా సంస్థ అధికారులు, పోలీసు  యంత్రాంగం చేసిన కృష పలించిందని చెప్పుకోవచ్చు. తమ కేసులను రాజీ కుదుర్చుకునెందుకు బారిగా తరలి వచ్చారు.  జిల్లా వ్యాప్తంగ జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా కోర్టుల న్యాయ మూర్తులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోర్ట్ లో జరిగిన సమావేశంలో న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.సత్తయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
.కొత్తగా జిల్లా కోర్టు అయినందుకు, లోక్ ఆదాలాత్ లో ఎక్కువగా కేసులు రాజీ అయ్యేల చూడాలన్నారు. నేడు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపెట్, బెల్లంపల్లి,చెన్నూర్ కోర్టుల పరిధిలో 4002 కేసులు పరిష్కారం చేసి రూ.కోటి లక్ష డెబ్భై నాలుగు వేల రూపాయలు రికవరీ చేశామన్నారు.