గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ తహసిల్ చౌరస్తా వద్ద భారీ నిరసన... --చైర్పర్సన్ డా.భోగ.శ్రావణి

Published: Friday July 08, 2022
జగిత్యాల, జులై, 07 ( ప్రజాపాలన ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ తహసిల్ చౌరస్తా వద్ద జగిత్యాల జిల్లా తెరాస  ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో   చైర్పర్సన్ డా.భోగ.శ్రావణిప్రవీణ్ పాల్గొన్నారు. చైర్పర్సన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలని పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నది. అన్ని విధాలుగా  అస్త వ్యస్థ జీవనాన్ని అనుభవిస్తున్నారు. మొన్నటికి మొన్న పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల ప్రబవం రవాణా వ్యవస్థ మీద పడి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. అసలే ఇబ్బందిలో ఉన్న బీద ప్రజలను మరింత ఇబ్బంది కి గురి చేస్తూ ఇప్పుడు వండి తినే పరిస్థితి లేకుండా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. ఒక ఈ ఏడాదిలోనే 4 సార్లు పెంచుతూ 193 రూపాయలు పెంచింది. మొత్తం గా కలిపి 2 సం లలో 419 రూపాయలు పెంచడం జరిగినది. 2014 లో 410 ఉన్న ధర ఇప్పుడు 1105 కి చేరినది. 2014 కంటే ముందు ఉన్న మహిళ మంత్రులు 5,10 పెరిగితేనే ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేసేవారు. మహిళలు ఆగ్రహించి బీజేపీ ని దేశం నుండి  తరిమికొట్టే పరిస్థితి రాకముందే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో  వైస్ చెర్మెన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్స్, కో అప్సన్ సభ్యులు, పార్టీ ఉపాధ్యక్షులు ఓల్లే మల్లేశం, ధూమల్ల రాజుకుమార్, ఆనందరావు, మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area