మంచిర్యాల జిల్లాలో సిసిఆర్ సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ సి సి అర్ ఉమ్మడి అదిలాబాద్ జి

Published: Wednesday June 29, 2022

జన్నారం రూరల్, జున్ 28, ప్రజాపాలన:   కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ మంచిర్యాల విభాగం ఆధ్వర్యంలో ఆర్టీఐ పై అవగాహన నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమం మంచిర్యాల సిపిఐ కార్యాలయం  లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఐలవేణి నర్సయ్య హాజరై నూతన సభ్యులకు ముఖ్య సలహాలు సూచనలు చేశారు. నూతన సభ్యుల దగ్గర అఫిడవిట్ అందుకొని గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం అయన సి సి ఆర్ రాగుల రవి నూతన సభ్యులతో మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చినప్పటికీ ఇప్పటికీ గ్రామస్థాయిలో చాలామందికి కనీసం దరఖాస్తు చేయడం కూడా అవగాహన లేకుండా ఉందని అన్నారు. ఆర్.టి.ఐ చట్టం పై ప్రజల్లో అవగాహన కొరకు అక్రమాలు, అలసత్వం, అన్యాయం, అవినీతి, అశ్రద్ధ రూపుమాపడం కోసం సిసిఆర్ కృషి చేస్తుందని తెలిపారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అని గ్రామ స్థాయి నుండి సిసిఆర్ కార్యక్రమంలో విస్తృతం చేయాలని తద్వారా మెరుగైన ప్రజా ప్రయోజనం కలుగుతోందని సిసిఆర్ సభ్యులు తెలిపారు. కేంద్ర కమిటీ సూచనలతో కార్యక్రమం చేసే ఈ విషయంలో సంస్థకు అధికారులపై తమకు ఎలాంటి విభేదాలు లేవని కేవలం ప్రజా సంక్షేమం కోరకే సంస్థ పని చేస్తుందని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్వీనర్ సిసిఅర్ ఐడి గుర్తింపు పంపిణీ సిసిఅర్ ప్రతినిధి రాగుల రవి, మందమర్రి ఇంచార్జ్ వేల్పుల కిరణ్ కుమార్, మంచిర్యాల ఇంచార్జ్ మిట్టపల్లి సంతోష్ కుమార్, నస్పూర్ కాలనీ ఇంచార్జ్ హరి రామకృష్ణ, జైపూర్ ఇంచార్జ్ జి రవి తదితరులు పాల్గొన్నారు.