ఉపాద్యాయుల ను సన్మానించిన బిసి జాగృతి.

Published: Monday September 06, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 5, ప్రజాపాలన : తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన బిసి ఉపాధ్యాయులను ఆదివారం  సన్మానించడం జరిగింది. సన్మాన గ్రహీతలు గుండేటి యోగేశ్వర్  రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మంచిర్యాల బాలుర పాఠశాల, చిదురాల రాజమౌళి సరస్వతి శిశు మందిర్, సిర్పూర్ సత్యనారాయణ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కిష్టాపూర్ ఎసంతుల స్వప్న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేచిని, బెల్లాల పద్మజ, హిందీ పండిత్ సరస్వతి శిశు మందిర్, వల్ల కుంట్ల రాజు శిశు మందిర్ ప్రిన్సిపాల్, రాజేశం గౌడ్ రిటైర్డ్ (యంఇఓ). లను ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ భారతదేశములో మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా  సేవలందించిన సావిత్రిబాయి ఫూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను కేంద్రప్రభుత్వము అధికారకంగా నిర్వహించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నారెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మడుపు రామ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మేoత్యాల సంతోష్, వైద్య భాస్కర్, ఎడ్ల పున్నం, గందే శ్రీ తిరుపతి, కార్యదర్శి తొకల మహేష్, సహాయ కార్యదర్శి గరబోయిన శ్రీనివాస్, బద్ది శ్రీనివాస్, నాయకులు గుమ్ముల సుదర్శన్, మంచర్ల సదానందం, ఆరెందుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.