వర్షపు నీటిని ఒడిసి పట్టాలి

Published: Thursday June 03, 2021

పరిగి మే 2 ప్రజాపాలన ప్రతినిధి : జలశేక్తి అభియాన్ పథకం ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణ అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో బుధవారం సర్పంచ్ కె.రాజిరెడ్డితో పనులను ప్రారంభం చేయించారు. జాతీయ ఉపాధి హామీ పతకం కింద చేపట్టే పనులను బోర్ బావులకు, మరియు వర్షపు నీరు వెళ్లే పల్లపు ప్రాంతాలు ఇళ్లపై కార్యాలయాలపై నుంచి వొచ్చే వర్షపు నీరు భూమిలో ఇంకే విదంగా చెర్యలు తీసుకోని పనులు చెపట్లాలని సర్పంచ్ రాజిరెడ్డిని కోరారు. ఇందుకు సంబంధించి సంబంధిత సిబ్బంది సహకరించాలని పీడీ కృష్ణ కోరారు. దోమ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద ఎస్సి కామ్యూనిటీ వాళ్లకు ఆరు వారాల వేతనాలు రాలేదని సర్పంచ్ పీడీ దృష్టికి తీసుకువెళ్లగా కామ్యూనిటీ వారీగా వేతనాలను వారి ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కాస్త సమయం జరిగితుందని అందుకు కూలీలు ఓపిక పట్టాలని, వారి ప్రయోజనం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పీడీ కృష్ణ సర్పంచ్ కె రాజిరెడ్డి కి సూచించారు. వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల కూలీలు పనులకు రావడంలో సందేహం వ్యక్తం చేస్తున్నారని పీడీకి సర్పంచ్ చెప్పారు. ఈ కార్యాక్రమంలో ఎంపీడీఓ జయరామ్,ఉపాధి హామీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.