కేశవపట్నంలో పోషన్ అభియాన్ కార్యక్రమం. శంకరపట్నం డిసెంబర్ 20 ప్రజాపాల రిపోర్టర్:

Published: Wednesday December 21, 2022

శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో అంగన్వాడి సెంటర్ లో మంగళవారం  ఐసిడిఎస్ వారు నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో  గర్భిణులకు పోషకాహారం వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  వాళ్ళు పాటించవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీఎంహెచ్ఓ జువేరియా మాట్లాడుతూ గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వైద్య సదుపాయాలు వివరిస్తూ ప్రతి ఒక్కరూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి, ముఖ్యంగా గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాతా శిశు వైద్య కేంద్రంలో తప్పనిసరి అయిన పరీక్షలు అన్ని రకాల సౌకర్యాలను వాడుకొని సంక్షేమం పొందాలని ప్రైవేట్ ఆస్పత్రిలోని ప్రసవానికై ఖర్చులు లక్షల్లో ఉంటుందని పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం వలన ఆర్థిక నష్టాన్ని  తగ్గించుకోవచ్చని ఆమె  తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్ బండారు స్వప్న ఎంపీటీసీ బొజ్జ కవిత ఎమ్మార్వో శ్రీనివాసరావు  ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.