జూలై 20న విద్యాసంస్థల బంద్ జయప్రదం చేయండి.* *ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు కంబాలపల్లి విప్లవ

Published: Tuesday July 19, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి.జూలై 20న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు కంబాలపల్లి విప్లవ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు జిల్లాలో 40% పాఠ్యపుస్తకాలు కూడా ఇవ్వలేదన్నారు. యూనిఫాం ఏ ఒక్క పాఠశాలలో ఇవ్వలేదనీ ఎప్పటికి ఇస్తారో తెలియదన్నారు.జిల్లాలో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక తల్లిదండ్రులు,విద్యార్థులు పాఠశాలకు తాళాలు వేసి నిరసన తెలిపే దుస్థితి ఏర్పడిందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవనీ, భవనాలు శిథిలావస్థకు చేరి వానకు కురుస్తున్నా కనీసం మరమత్తులు చేపట్టడంలేదన్నారు.జిల్లాలో ఒక్కో ఎంఈవో నాలుగైదు మండలాలకు ఇన్ చార్జీలుగా ఉన్నారన్నారు.ఆయా పోస్టులను భర్తీ చేయవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిఇఓ, డిప్యూటీ డిఇఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు.పాఠశాలలకు గ్రాంట్స్ కేటాయించాలనీ,స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలనీ, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్ధులకు అందించే మద్యాహ్న భోజనం మెనూ చార్జీలు పెంచాలనీ,నాణ్యమైన పౌష్టిక విలువలు కల్గిన భోజనం అందించాలన్నారు.విద్యారంగాని అత్యంత ప్రమాదకరమైన నూతన విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయవద్దన్నారు.మన ఊరు-మన బడి కార్యక్రమం మందకొడిగా సాగుతుందనీ, జిల్లాలో అన్ని పాఠశాలలు ఈ పథకం క్రింద చేర్చి అభివృద్ధి చేయాలన్నారు.ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రైవేటు,కార్పోరేట్ యాజమాన్యాలను కట్టడి చేయడంలో,ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
ఈ బంద్ కి విద్యార్థులు, తల్లిదండ్రులు అందరు సహకరించాలని కోరారు.