మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Published: Monday January 31, 2022

కోరుట్ల,జనవరి 30(ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు  ఎంపీ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పటిష్టమైన నాయకత్వంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు మరియు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ల సూచనలతో కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ కుటుంబం ఆధ్వర్యంలో మహాత్ముని వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామనికి మహాత్మా గాంధీ  ఒక ముఖ చిత్రం లాంటి వారు అని, సత్యం ఆయన మార్గమని, అహింసను ఆయన ఆయుధంగా వాడుకుని శాంతితో, సామజిక ఐక్యతతో  దేశంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి అయినా దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేయడమే లక్ష్యంగా పోరాడేలా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ చైతన్యం నింపిన ఘనత మరియు సమర్థ నాయకత్వం మహాత్మా గాంధీ అని అన్నారు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్ముని ఆయుధాలు అని, కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటాడు. ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు అని కొనియాడారు. ఈ  కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాస భూమయ్య, మాజీ ఎంపీటీసీ బర్కం నర్సయ్య, కోరుట్ల మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముహమ్మద్ నబీ, వార్డ్ మెంబర్ ద్యాగ గంగాధర్, పిట్టల రమేష్ ముదిరాజ్, మీసాల ముత్తన్న, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బర్కం బక్కన్న, కాంగ్రెస్ నాయకులూ చిట్టి బాబు, బర్కం రవి, బండ్ల రమేష్, బర్కం వెంకట్ నారాయణ, రసత్ పాషా, రుద్ర వెంకట్ రాములు,  డి.శంకర్, నానేం పెద్ద రాజం, పడాల వెంకట్ రాములు యూత్ కాంగ్రెస్ శ్రేణులు ప్రిన్స్ ఫరూక్, ముహమ్మద్ సాధిక్, ఎండీ ఆరిఫ్, ఎండీ వహీద్, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి ముహమ్మద్ నసీర్, తదితరులు పాల్గొన్నారు.....