విద్యార్థులకు పోషక ఆహారంపై అవగాహన కల్పించాలి.* -ఊరేళ్ళ సర్పంచ్ మహమ్మద్ జాంగిర్.

Published: Tuesday December 06, 2022

చేవెళ్ల డిసెంబర్ 5 (ప్రజా పాలన):-


జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరెళ్ల లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం....
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరెళ్ళలో సోమవారం రోజు విద్యార్థుల చేత ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మహమ్మద్ జహంగీర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన పిల్లలకు పోషకాహారం పట్ల సరైన అవగాహన కలుగుతుందని అన్నారు.  ప్రస్తుత రోజుల్లో మార్కెట్లలో లభ్యమవుతున్న రెడీమేడ్ ఆహార పదార్థాల పట్ల జనం ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని దీనిలో వివిధ కలుషితాలు కలపడం వలన అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు.సాంప్రదాయ పద్ధతుల ద్వారా తయారు చేసే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివని పాఠశాల ప్రధానోపాధ్యాయులు  గోపాల్ గారు అన్నారు. ఆహార పదార్థాల తయారీలో వాడే దినుసులు, వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ విధానం మరియు వాటిలో ఉండే పోషకాల గురించి ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చాలా చక్కగా అర్థవంతంగా అవగాహన కల్పించవచ్చని అన్నారు. సుమారుగా 60 మంది విద్యార్థులు ఈ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.వివిధ ఆహార పదార్థాలను తయారు చేయడమే కాకుండా వాటి ప్రాముఖ్యత మరియు పోషక విలువల గురించి చాలా చక్కగా వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని చాలా ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు,కృష్ణ ప్రకాశ్ రెడ్డి, అక్బర్, శ్రీశైలం, చాముండేశ్వరి, నర్మదా, భాగ్యలక్ష్మి, శ్రీలత పాల్గొన్నారు