వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Published: Tuesday August 02, 2022

మధిర ఆగస్టు 1 ప్రజా పాలన ప్రతినిధి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో మధిర తహసిల్దార్ కార్యాలయం వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి ఏడో రోజుకు చేరుకున్నాయి. వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని వివిధ రాజకీయ పార్టీ నేతలు సందర్శించి, వారికి సంఘీభావం ప్రకటించి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కలిగించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. అకాల మరణం పొందిన విఆర్ఓ కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని,

వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు నరేష్ వెంకటేశ్వర్లు రవికుమార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.