మహిళా సమస్యలపై నిరంతరం పోరాటం: ఐద్వా

Published: Thursday March 10, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 9 ప్రజాపాలన ప్రతినిధి : అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) యాచారం మండల నూతన కమిటీ ని ప్రజాసంఘాల కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు అరుణ, సునీత గార్లు మాట్లాడుతూ... మహిళా సమస్యలపై ఐద్వా సంఘం నిరంతరం దేశ వ్యాప్తంగా పోరాడుతుందని, మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని, మహిళా హక్కులకై పోరాడుతుందని అన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాదని సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలపై ఇంకా దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుండటం ప్రభుత్వాల చేతగాని తనానికి నిదర్శనమన్నారు. అనంతరం ఐద్వా మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా పెరుమాళ్ళ ఉమా, కార్యదర్శిగా మస్కూ అరుణ, ఉపాధ్యక్షురాలుగా పుష్ప సునీత, సహాయ కార్యదర్శులుగా.. ఎస్ మౌనిక, లలిత, లావణ్య మరో పది మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి, అనిత, రాములమ్మ, వనిత తదితరులు పాల్గొన్నారు.