వేసవి జాగ్రత్తల పట్ల అవగాహణ సదస్సు

Published: Friday March 19, 2021

ప్రజాపాలస - క్యాతనపల్లి, 18 మార్చి 2021 : మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సి హెచ్ పి కార్మికులకు ఏరియా వైద్యాధికారి లోక్ నాథ్ రెడ్డి వేసవి కాలం తీసుకోవల్సిన జాగ్రత్తలపట్ల అవగాహన కల్పించారు. అనంతరం గురువారం ఆయన మాట్లాడారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గడం తో వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని తెలిపారు. నీరు తగ్గడం వల్ల కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాల వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని అన్నారు. క్రమం తప్పకుండా రోజుకు 6 లీటర్ల నీరు తీసుకోవాలని సూచించారు. అలసటగా ఉన్నప్పుడు ఉప్పు, చక్కెర కలిపిన ద్రావణం లేదా ఓఆర్ఎస్ ద్రావణాన్ని సేవించాలని అన్నారు. కార్మికులకు రక్తపోటు వచ్చిన సమయంలో చల్లని ప్రదేశంలోకి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వైద్యులను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ రామ్మోహన్, డిఎం చెరువు శ్రీనివాస్, డివైఎస్ ఈ చంద్రమౌళి, పిట్ సెక్రెటరీలు శ్రీనివాస్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.