స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి

Published: Thursday July 15, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూలై 14 ప్రజాపాలన బ్యూరో : యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘం సభ్యులకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సె‌ర్ఫ్) వారి ఆర్థిక సహాయంతో గ్రామీణ జీవనోపాదుల రుణాలతో మంజూరైన పాస్ట్ ఫుడ్ సెంటర్, టైలరింగ్ షాప్, బొలెరో, టిఫిన్ సెంటర్ మరియు సారీ సెంటర్ యూనిట్లను జిల్లా కలెక్టర్ పౌసుమి బసు ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి ఎక్కువగా యువకులు కలిగిన దేశంగా భారతదేశం ఉందన్నారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. యువకులు తప్పనిసరిగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువకులందరూ స్వయం ఉపాధి దిశగా ఆలోచించాలన్నారు. ప్రభుత్వం వారి కోసం ప్రతేక రాయితీలు కల్పిస్తుందన్నారు. అనంతరం గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. దాతల ద్వారా డ్రిప్ సమకూర్చుకొని అడవి లాగా పెంచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు, ఎంపీపీ చంద్రకళ, ఏఎంసి చైర్మన్ విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి కృష్ణన్, అదనపు పిడి నర్సింలు, ఎంపిడిఓ సుభాషిణి, ఎంపిఓ నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు కమాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు వెంకటయ్య, జనరల్ సెక్రెటరీ సత్తయ్య గౌడ్, నారాయణపూర్ మాజీ సర్పంచ్ ఎర్రవల్లి సుభాన్ రెడ్డి, గ్రామస్థులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.