59 జీఓలో అవక తోవకాలు, అర్హులకు రెగ్యులరైజ్ చెయ్యాలి

Published: Friday June 18, 2021
జిన్నారం, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 59 జీవోను మధ్యలోనే ఆపేసి పేదల యొక్క రిజిస్ట్రేషన్లను ఇంతవరకు కొనసాగించలేదు, బొల్లారం ప్రాంతంలో అనేక మంది వలస జీవులు ఒక పూట తిండికి మాత్రమే పరిమితమై అనేక కంపెనీలలో పనులు చేసుకుంటూ వారి జీవనం కొనసాగించుకుంటూ ఉంటున్నారు. అలాంటి పేద ప్రజలు రూపాయి రూపాయి డబ్బు పోగు చేసుకుని సొంతింటి కల కోసం ఏర్పాటు చేసుకున్న గృహాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు వారికి రెగ్యులరైజ్ చేస్తా అని ప్రకటించడం జరిగింది. మా బొల్లారం మున్సిపాలిటీ లో మొత్తం 1936 అప్లికేషన్లు రావడం జరిగింది అందులో అధికారులు 789 అప్లికేషన్లు మాత్రమే పూర్తి చేయడం జరిగింది. మిగతా 1147 అప్లికేషన్లను ఇంకా పూర్తి కాలేదు ఇందులో పూర్తి మొత్తం డబ్బు చెల్లించిన వారు కి కూడా ఇంతవరకూ రెగ్యులరైజ్ కాలేదు, అలాగే సగం మొత్తాన్ని చెల్లించిన వారికి కూడా కాలేదు. కానీ బొల్లారం మున్సిపల్ కేబిఆర్ కాలనిలో 2011 సంవత్సంలో 770 గజాల భూమిని రైతు బజారు కోసం ఆ నాటి ఈఓ ఆనంద్ మేరీ గారు 33సంవత్సరాల వరకు లీజ్ కి ఇవ్వడం జరిగింది. కానీ ఆ భూమిని లీజ్ కి తీసుకున్న వ్యక్తి ఆ యొక్క భూమిని తన కుటుంబ సభ్యుల పేరుమీద రెగ్యులరైజ్ చేసుకోవాడం జరిగింది. దీనికి తోడు బీసీ కాలనీలో వున్నా సర్వే నెంబర్ 44లో 49 మంది రెగ్యులరైజషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు, అయితే దింట్లో ముగ్గురికి మాత్రం (ఒకరికి 4840 గజాలు, 795 గజాలు మరియు 600 గజాల) భూమిని రెగ్యులైజషన్ చేసిన ప్రభుత్వ ఆదికారులు. అయితే 46 మందికి ఇది హుడా ల్యాండ్ కాబట్టి రెగ్యులరైజ్ చెయ్యడానికి కుదురదు అంటున్న అధికారులు. 2015 లో హౌస్ టాక్స్ తీసుకున్న వారికీ మరియు 2018లో హౌస్ టాక్స్ తీసుకున్న వారికీ రెగ్యులరైజషన్ అయింది, ఇది ప్రభుత్వ అధికారులు ఎలా చేసారు. ఆ సంవత్సరంలో రెగ్యులరేషన్ చేసిన వారిపై వీళ్ళు ఎక్కడున్నా చెట్టరిత్యా చెర్యలు తీసుకోగలరని స్థానికులు కోరుకుంటున్నారు, అలాగే తమకు అన్యాయం జరిగింది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున దీనిపై ప్రత్యేక చొరవ చూపించి అధికారుల ద్వారా ఈ ఒక్క 59 జీఓ ను పేద ప్రజలకు పూర్తి చేసి వారి యొక్క సొంత ఇంటి కలను నెరవేర్చి కెసిఆర్ గారి యొక్క ఆకాంక్షను నెరవేరుస్తారని బొల్లారం ప్రజల తరఫున బీజేపీ నాయకుడు సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు టీ. రవీందర్ రెడ్డి కోరారు.