ఇల్లు లేని పేదవారికి ఇళ్ల స్థలాలపట్టాలివ్వాలి. సిపిఐ పార్టీ. -చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్ల

Published: Tuesday November 15, 2022

చేవెళ్ల నవంబర్ 14 (ప్రజాపాలన):-

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి పేదలకు ఇళ్ల జాగాలు చూపించాలని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం ఈ సందర్భంగా సీపీఎం పార్టీ చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి  దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్లో చాలా గ్రామాలలో గత ప్రభుత్వాలు పేదలందరికీ ఇళ్ల పట్టాలి ఇచ్చారని వాళ్ళందరికీ జాగాలు చూపించాలని ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు అదేవిధంగా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామస్తుల కు 1996 సంవత్సరంలో ఇళ్ల పట్టాలి ఇచ్చారని అందులో కొంతమంది ఇల్లు కూడా కట్టుకున్నారని చాలామంది కట్టుకోవడం సిద్ధంగా ఉన్నారని వారిని రెవెన్యూ అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ ఇక్కడ ఇల్లు కడుక్కోకూడదని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు చేవెళ్ల నియోజకవర్గం లో చాలా ప్రభుత్వ భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఫామ్ హౌస్ ల పేరుతో కబ్జా చేసిన పట్టించుకోని రెవెన్యూ అధికారులు పేదవారు పట్టాలు ఉన్నటువంటి వారు ఇల్లు కట్టుకుంటామంటే ఎందుకు వారిని అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు చేవెళ్ల ఆర్డిఓ గారు వెంటనే స్పందించి ఇళ్ల పట్టాలు ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు చూపించాలని అన్నారు లేనిపక్షంలో పేద ప్రజలందరినీ ఐక్యపరిచి గుడిసెల పోరాటం ప్రారంభిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లేష్ గోపాల్ రాములు బలరాం ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ సిపిఎం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు