గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ** జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యాదవరావు **

Published: Wednesday February 01, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 31 (ప్రజాపాలన,ప్రతినిధి):
జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన విధంగా పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన తెలంగాణ చరిత్ర, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. సిర్పూర్, రెబ్బెన గ్రంథాలయ భవనములు కూలిపోయినందున ప్రత్యామ్నాయ భవనాల ఎంపికకు చర్యలు తీసుకుంటున్నామని, స్వీపింగ్, డస్టింగ్, పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం పెంచేందుకు ఆమోదించడం జరిగిందని తెలిపారు.ఈ సమావేశంలో గ్రంధాలయ కార్యదర్శి మునీశ్వర రావు, సంస్థ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.