నష్టపోయిన రైతులకు పంట బీమా పథకాన్ని వర్తింప చేయాలి నష్టమైన పత్తి పొలాలను పరిశీలించిన సిపిఐ

Published: Thursday July 28, 2022
బోనకల్ ,జూలై 27 ప్రజా పాలన ప్రతినిధి: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి పసల యోజన బీమా పథకాన్ని వర్తింపజేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని సిపిఐ మండల సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మోటమర్రి గ్రామంలో అకాల వర్షాలకు నష్టమైన పత్తి పొలాలను సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు మాట్లాడుతూ మండలంలో దాదాపు 5 వేల ఎకరాలు అకాల వర్షాలకు నష్టపోయాయని ముఖ్యంగా వైరా నది పరివాహక ప్రాంతమైన రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట, రాయన్నపేట, మోటమర్రి గ్రామాలలోని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా మెట్ట రైతులు తీవ్రంగా నష్టపోయారని,మొక్క దశలో ఉన్న పత్తి నీటి శిక్ష పడి చనిపోతే ఆ రైతు మరల పెట్టుబడి పెట్టి మొదటి నుండి పనిచేసుకోవాలన్నారు. ఈ రకంగా ఒక్కొక్క రైతు ఎకరానికి 20 నుండి 25 వేల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రధానమంత్రి పసల్ బీమా యోజన పథకాన్ని వర్తింపజేస్తూ నష్టపరిహారాన్ని అందించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మోటమర్రి గ్రామ శాఖ కార్యదర్శి బుర్రి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శి మరీదు మల్లయ్య,మోటమర్రి డైరెక్టర్ మరీదు శ్రీను, రైతులు అంగీరిక మల్లయ్య, పిక్కిలి సత్యనారాయణ, పిక్కిలి బాబు, పిక్కిలి శ్రీను, గౌరరాజు వెంకటేశ్వర్లు,గౌరరాజు వెంకయ్య, గౌరరాజు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area