సుభాష్ చెంద్రబోస్ 125వ జయంతి వేడుకలు

Published: Monday January 24, 2022
మంచిర్యాల టౌన్, జనవరి 23, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం రోజున  మంచిర్యాల లోని లక్ష్మీనగర్ నందు జాగృతి కార్యాలయం లో సుభాష్ చెంద్రబోస్ 125వ జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ సుభాష్ చెంద్రబోస్ స్వతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వారిని గడగడ లాడించి స్వతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర పోషించారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి సాహితీ జిల్లా అధ్యక్షులు దుర్గం రాజేశం గౌడ్ జాగృతి జిల్లా నాయకులు మల్లేశం గారు భూక్యా రాజన్న గారు పాల్గొన్నారు