వాహనదారులు అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలి మంచిర్యాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాద

Published: Thursday March 02, 2023

జన్నారం, మార్చ్ 01, ప్రజాపాలన: వాహనదారులు వాహనం నడిపే సమయంలో అన్ని రకాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని మంచిర్యాల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాదవ్ యోగేశ్వర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన పత్రాలు లేని ట్రాక్టర్ ను సీజ్ చేశారు. మండలంలోని వాహనం ఉన్న ప్రతి వాహనదారుడు 18 సంవత్సరాల నుండి ఉన్న వారు వాహనం డ్రైవింగ్ చేయాలన్నారు. టు వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి వాహనదారుడు ఇన్సూరెన్స్ ఆర్ సి ఇతర అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. వాహనదారుడు వాహనం నడిపే సమయంలో రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. అతివేగంగా వాహనం నడపకూడదని ఆయన కోరారు. వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జన్నారం ఎస్ఐ సతీష్, పోలీసులు, వాహనదారులు పాల్గొన్నారు.