ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు విప్ రేగా కాంతారావు ఫోటోలకు క్షీరాభిషేకం చేసిన బూర్గంపాడు బిఆర్ఎ

Published: Monday November 28, 2022

బూర్గంపాడు( ప్రజా పాలన)

ఈరోజు బూర్గంపాడు మండలం సారపాక పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చిత్రపటానికి  బూపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  ఆధ్వర్యంలో  క్షీరాభిషేకం చేశారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టితో రేగ కాంతారావు యొక్క పట్టుదలతో నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించడం జరిగినది.. ఈ సందర్భంగా బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకురావడంలో రేగా కాంతారావు ఎనలేని కృషి చేశారని అందుకుగాను వారికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు బూర్గంపాడు మండలం, సారపాక పట్టణ ప్రధాన కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగినది. అంతేగాకుండా ప్రజల కోసం టిఆర్ఎస్ పార్టీ ఎన్నో అమోఘమైన పథకాలు తీసుకువచ్చిందని అందులో భాగంగా రైతుల కోసం రైతుబంధు రైతు బీమా తెలంగాణ ఆడపడుచుల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రజల అవసరాల కోసం మిషన్ భగీరథ మంచినీళ్లు, రైతులు కోసం 24 గంటలు కరెంటు, దళితుల కోసం దళిత బంధు, ఇవ్వడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏదో అవసరమో దాని కసం పాటుపడే వ్యక్తి శ్రీ రేగా కాంతారావు అని, ప్రజలకు రోడ్లు.  డ్రైనేజీలు, మంచినీళ్ల కోసం  100 కోట్ల నిధులు కేటాయించిన అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు కొనకంచి శ్రీను, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మరియు మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, టౌన్ యవజన విభాగం అధ్యక్షుడు చైతన్య రెడ్డి ,చల్లకోటి పూర్ణ, బాలి శ్రీహరి, ఏసోబు, గోనెదారుగా, మరి సాంబ రెడ్డి, కృష్ణ, మనీ, ఎల్లంకి లలిత యువజన నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.