కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయిరైతు సంఘం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మంద

Published: Saturday July 02, 2022

మధిర,జులై 1 ప్రజాపాలన ప్రతినిధి: రాజకీయ లబ్దికోసం తెలంగాణ రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మందడపు రాణి అన్నారు. శుక్రవారం నుంచి హుజూర్ నగర్ లో 1 2 3 తేదీల్లో జరిగే తెలంగాణ రైతు సంఘం మహాసభలకు మధిర మండలం నుంచి ఆ సంఘం నాయకులు ఆధ్వర్యంలో మహిళలు రైతులు పెద్ద సంఖ్యలో బయల్దేరి వెళ్లారు. ముందుగా మండల పరిధి మల్లవరం గ్రామంలో ఉన్న మాజీ ఖమ్మం జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మందడపు రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో రబీ సీజన్‌లో రైతులు 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, ఇప్పుడు కేవలం 35 లక్షల వరకు మాత్రమే సాగు చేస్తున్నారన్నారు.ప్రత్యామ్నాయ పంట లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటూ రైతులను మోసం చేశారని రాణి ఆరోపించారు. కేసీఆర్‌ చేత కానీ తనం తోనే రైతులు నష్టపోయారన్న రాణి ఎరువుల ధరలు ప్రతి ఏడాది పెరుగుతున్నాయన్నారు.మూడేళ్ల క్రితం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని, రుణమాఫీ చేస్తామని రైతులను మభ్యపెట్టారని,4 సంవత్సరాలైనా మాఫీ కాలేదన్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై రైతు సంఘం ఆధ్వర్యంలో దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.హుజూర్నగర్ లో జరిగే పార్టీలకతీతంగా రైతులు పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు,సిపిఐ మండల కార్యదర్శి వుట్ల కొండలరావు,చెరుకూరి వెంకటేశ్వర్లు,మచ్చ వెంకటేశ్వర్లు,సుజాత,గరిడేపల్లి వెంకటేశ్వర్లు,మచ్చ పద్మ, మహిళా రైతులు మహిళా కార్యకర్తలు, నాయకులు తదితరులు ఉన్నారు.