ఉపాధి పనులపై నూతనకల్లులో గ్రామసభ

Published: Monday October 03, 2022
తల్లాడ, అక్టోబర్ 2 (ప్రజాపాలన న్యూస్):
మండలంలోని నూతనకల్లు గ్రామంలో ఉపాధి హామీ పనులపై ఆదివారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేశారు. సభకు ఎంపీడీవో భీమి రెడ్డి రవీంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పనుల ద్వారా పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని  సూచించారు. తోలుత పంచాయతీ కార్యాలయంలో  గాంధీ జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి సర్పంచ్ తూము శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామసభలో గ్రామాభివృద్ధికి  పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సీతారాములు, సెక్రటరీ ఇజాజ్, నాయకులు కళ్యాణపు కృష్ణయ్య, కళ్యాణపు వెంకటయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.