కాంగ్రెస్ నాయకులు అరెస్ట్...

Published: Friday July 23, 2021
జగిత్యాల/ బీరుపూర్/ సారంగాపూర్, జులై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల, బీరుపూర్ మరియు సారంగాపూర్ మండల్ కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు చలో హైదరాబాద్ (రాజ్ భవన్) ముట్టడి ధర్నా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నారని రాజ్ భావన్ ముట్టడి ధర్నాకు పిలుపు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులను పోలీసు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎంపీపీ మసర్తి రమేష్ చెరుపూరి శభాష్ పాత రమేష్ బలుమురి లక్ష్మణ్ రావు కొండ్ర రాంచందర్ రెడ్డి నక్క జీవన్ కల్లేపల్లి దుర్గయ్య బండ శంకర్ గిరి నాగభూషణం గుండ మధు కట్ట శివ తదితరులు బుధవారం రోజున రాత్రి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.