క్షయ వ్యాధి నివారణ పై క్యాంపు

Published: Saturday October 15, 2022

ఇబ్రహీంపట్నం,అక్టోబర్ 14 (ప్రజాపాలన  ప్రతినిధి): మండలంలోని  వర్షకొండ గ్రామంలో  ఆక్టివ్ కేస్,(టిబీ ) డిటెక్షన్ (తెమడపరీక్ష) క్యాంపును నిర్వహించారు. ఇందులో 27 మంది నుండి తెమడ పరీక్ష నమూనాలను సేకరించి పరీక్షకు పంపించడం జరిగింది.
క్షయ వ్యాధి నివారణ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు,డాక్టర్ వనజ,హెచ్ ఈ వెంకటేశం వ్యాధి లక్షణాలను వివరిస్తూ రెండు వారాల పైబడి దగ్గు, సాయంత్రం పూట జ్వరము,ఆకలి మందగించడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారిని  ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లయితే తెమడ పరీక్షలో క్షయ నిర్ధారణ అయినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రి నుండి డాట్స్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుందని అన్నారు. నిక్షయ్ పోషన్ యోజన గూర్చి వివరించారు. క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్క పౌరుడు  తమ వంతు బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యాధిని నిర్మూలించడం సాధ్యమవుతుందని, క్షయ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ  పొనకంటి చిన్న వెంకట్,హెచ్ ఈ హెచ్  వెంకటేశం,  ఉష, యల్ టి నవకాంత్, ఏ ఎన్ ఎం  విజయ కుమారి, మరియు ఆశాలు  కార్యక్రమంలో పాల్గొన్నారు.