ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ప్రతి తరగతి గదులను తప్పనిసరిగా శానిటేషన్ చేయాలి : ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్

Published: Tuesday February 01, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : రేపటినుండి పున: ప్రారంభం అవుతున్న సందర్భంగా పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రతి తరగతి గదులను శానిటేషన్ చేయాలి. అదే విధంగా విద్యార్థులు తరగతి గదిలోకి ప్రవేశించేముందు షానిటైజర్ బాటిళ్లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క విద్యార్థి చేతులు శుభ్రపరుచుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలియచేసారు. అంతేకాకుండా విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఇంటివద్ద మాస్కు ధరింపచేసి పాఠశాలకు పంపవలెనని అన్నారు. టాయిలెట్స్ వద్ద కూడా పరిశుభ్రతను పాటిస్తూ, మంచినీరు మరియు భోజనం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థుల ఆరోగ్యాలను కాపాడాలని వారు విద్యా సంస్థలకు తెలియజేశారు.