వత్తిడి లేని విద్యను అందించాలి *తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్

Published: Tuesday January 10, 2023
వికారాబాద్ బ్యూరో 09 జనవరి ప్రజాపాలన : ఉపాధ్యాయులు సన్మార్గం, క్రమశిక్షణ, వత్తిడిలేని విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ హితవు పలికారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి సమీపంలోని
భృంగి పాఠశాల 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తమిళ్ సై సౌందర రాజన్ కు భృంగి విద్యాలయాల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి బిజెపి నాయుడు ఆలె చంద్రశేఖర్ భృంగి పాఠశాల కార్యదర్శి ఆలె ప్రమీల గౌతమి మాడల్ స్కూల్ డైరెక్టర్ వెంకట్ నారాయణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆటపాటలను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు విద్యనందించాలన్నారు. విలువలతో కూడిన విద్యను అందించాలి. కరోనా సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేల వ్యాక్సిన్లు అందించారన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాఠశాల డైరెక్టర్ కుమారస్వామి పాఠశాల అభివృద్ధి నివేదికను చదివారు. వివిధ క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అంతకు ముందు చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను కన్నార్పకుండా చేశాయి. మాజీ మంత్రి ఆలె చంద్రశేఖర్ మాట్లాడుతూ భారతదేశం సాంస్కృతిక సాంప్రదాయాలు ఉట్టిపడేలా భృంగి పాఠశాలలో సుశిక్షితులతో నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. నా తల్లిదండ్రులు నా చదువుకు ఎంతో శ్రమకోర్చి విద్యావంతున్ని చేశారని భావోద్వేగంతో చెప్పారు. వెనుకబడిన వికారాబాద్ ప్రాంతంలో ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో భృంగి పాఠశాలను స్థాపించామని వెల్లడించారు. పాఠశాలను క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న పాఠశాల కార్యదర్శి ఆలె ప్రమీల చంద్రశేఖర్ కు ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.