తల్లాడ, జనవరి 14 (ప్రజా పాలన న్యూస్): సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సవాల

Published: Monday January 16, 2023

 తల్లాడ, జనవరి 14 (ప్రజా పాలన న్యూస్): సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని తల్లాడ జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, బీఆర్ఎస్ జోనల్ చైర్మన్ దాసురావు దంపతులు సూచించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు  ప్రతీకగా ఇళ్లల్లో ప్రత్యేక అలంకరణగా ముగ్గులు వేసి సంక్రాంతి పండుగలు జరుపుకుంటారన్నారు. ప్రజలందరూ పాడిపంటలతో కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని వారు కోరారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ వారు పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.