అంబేద్కర్ విగ్రహాలకు పార్టీల జెండాలు కట్టడం అవమానకరం ప్రజాపాలన

Published: Saturday June 18, 2022
కొడంగల్ ప్రతినిధి జూన్ 17:కొడంగల్ పట్టణంలో గల డా"బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు ఉదయం అంబేద్కర్ యువజన సంఘం తాలూకా అధ్యక్షులు యు రమేష్ బాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చుట్టూ పార్టీల జెండాలు, బ్యానర్లు మరియు ప్లెక్సీలు కడితే అంబేద్కర్ గారిని అవమానపరిచినటు అవుతుందని, ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి మేమోరణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దళిత కుల సంఘాలు మరియు అంబేద్కర్ సంఘాలు నాయకులు పాల్గొనడం జరిగింది. జి అశోక్, కే దస్తప్ప, ఏం వెంకటేశం, డీ దస్తప్ప, డీ దేవరాజ్, ఏ రమేష్, తదితరులు పాల్గొన్నారు.