ఎకో ఫ్రెండ్లీ దుస్తులతో అలరించిన ఫ్యాషన్ షో హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Tuesday April 04, 2023

ఎకో ఫ్రెండ్లీ దుస్తుల ఆవశ్యకతను వివరిస్తూ నిర్లోజ్యొ  సంస్థ నిర్వహించిన ఫ్యాషన్ షో ఎంతగానో అలరించింది. ఫిలంనగర్ లో ని ఓ కేఫెలో యువతి యువకులు వ్యర్థ పదార్థాల సమ్మిళితంగా రూపొందించిన మోడ్రన్ దుస్తులు దరించి ర్యాంప్ పై నిర్వహించిన వాక్ ఆకట్టుకుంది. పర్యావరణానికి హాని చేయని వస్త్రాలను ప్రమోట్ చేసే లక్ష్యంతో ఇండో-జపనీస్ మేలవింపుతో దుస్తులను రూపొందిస్తున్నట్లు డిజైనర్ సుష్మిత చౌదరి తెలిపారు.