మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంచినీటి వసతి ఏర్పాటు అభినందనీయం: మండ

Published: Monday April 26, 2021

ఏప్రిల్ 25, ప్రజాపాలన ప్రతినిధి : గుమ్మడిదల గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మైత్రీ ఫౌండేషన్ మంచినీటి వసతి ఏర్పాటు చేయడం అభినందనీయమని మండల ప్రెస్ క్లబ్ కన్వీనర్ కానం శేఖర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే కరోన పరీక్షల కొరకు, కరోన టీకాలు వెయుంచుకునేందుకు వచ్చే ప్రజాల దాహార్తి తీర్చేందుకు మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా కానం శేఖర్ హాజరై చలివేంద్రం ప్రారంభించారు. మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్ మాట్లాడుతూ అన్నారం గ్రామ సర్పంచ్ తిరుమల వాసుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, అన్నారం గ్రామ పంచాయతీకి ప్రత్యేక అంబులెన్స్ ఉన్నప్పటికి వారు మైత్రీ ఫౌండేషన్ అంబులెన్స్ కు నెలనెలా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది సుబ్రమణ్యం, ముజీబ్, మైత్రీ ఫౌండేషన్ సభ్యులు మ్యాకాల మహేష్ కుమార్ కుంటి మలేష్, సూర్యనారాయణ, కంది రాము, నవీన్ సాగర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.