కొత్లాపూరు గ్రామంలో మినీ పార్కు నిర్మాణం : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Friday October 29, 2021

వికారాబాద్ బ్యూరో 28 అక్టోబర్ ప్రజాపాలన : మినీ పల్లె ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్రావు గౌడ్ అన్నారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోగల మర్పల్లి మండలానికి చెందిన కొత్లాపూర్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో లో ఎంపీపీ బట్టు లలిత జడ్పిటిసి మధుకర్ లతో కలిసి మినీ పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేయడానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఎకరముల స్థలంలో మినీ పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల 15000 మొక్కలు పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు భూమి చదును చేయుట, మొద్దులు తొలగించుట, తేలికపాటి పొదలు తొలగింపు, పార్క్ చుట్టూ గచ్చకాయతో ఫెన్సింగ్, గేట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇట్టి పనులు పూర్తిగా ఉపాధి హామీ నిధులతో చేపడుతామని స్పష్టం చేశారు. పిల్లలకు ఆట స్థలము, వాకింగ్ పాత్, మొక్కలకు నీరు పట్టుటకు రోడ్ల నిర్మాణం వంటి పనులను చేపట్టాలని తెలిపారు. సుమారు తొమ్మిది లక్షల నిధులతో నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సోమలింగం, ఏపిఓ అంజిరెడ్డి, ఇసి విఠల్ రావు, టిఏ విష్ణు, పుర్షోతం కార్యదర్శి నాగయ్య స్థానిక సర్పంచ్ ప్రభాకర్ ఎంపిటిసి గ్రామస్తులు పాల్గొన్నారు.