బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ... బ్యాంకు మేనేజర్ రాజశేఖర్

Published: Friday August 26, 2022
జన్నారం, ఆగస్టు 25, ప్రజాపాలన: 
 

బ్యాంకు డిజిటల్ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజశేఖర్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్ గ్రామంలో ఎర్పాటు చేసిన బ్యాంకు ఖాతదారుల అవగాహన సదస్సులో అయన మాట్లాడారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ సేవాల ఉపయోగం వల్ల ఖాతాదారులు బ్యాంకు కు డైరెక్ట్ రావలసిన అవసరం వుండదని, బ్యాంకు కు ఖాతవున్నా వ్యక్తి ఎ చోట  నుండియైన లావాదేవీలు జరుపుకోవచ్చుని, ఖాతాదారు సమయమ వృదాకాదని తెలిపారు. ప్రస్తుతం  అన్ లైన్ సంబంధించి మెాసాలు ఎర్పడినప్పుడు బ్యాంకు సిబ్బందిని నేరుగా కలసి మీ సమస్యలను పరిష్కరం  చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ అన్నారు. అన్ లైన్ లో మెాసాలు జరిగే సమయంలో బ్యాంకు ఎటిఎం కార్డు ఓటిపి నెంబర్ ఇవ్వడం గాని ఖాతాదారులను ఇటువంటివి ఏమి చేయవద్దని, బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా ఖాతాకు సంబంధించినవి వివరాలను పోనులలో అడుగరు. అన్ లైన్ డిజిటల్ సేవాలు వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని అయన తెలిపారు.ఈ కార్యాక్రమంలో తపాలపూర్ బ్యాంకు పీల్డ్ డైరెక్టర్ ఆదిత్య, బ్యాంకు సిబ్బంది, మహిళలు, ఖాతాదారులు, ప్రజలు పాల్గొన్నారు.