డిసియంఎస్ గోడౌన్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

Published: Wednesday April 28, 2021
పరిగి, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం దోమ మండల కేంద్రంలోని డిసియంఎస్ గోడౌన్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిగి నియోజక వర్గ ఎమ్యెల్యే కొప్పుల మహేష్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిసియంఎస్, పిఏసిఎస్, ఐకేపి ద్వారా నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు రైతులు దాన్యం విక్రయించాలని పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని దోమ, దిర్సంపల్లి, గుండాల్, దాదాపూర్, కిష్టాపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ మనోహర్ రెడ్డి, దోమ జెడ్పిటిసి నాగిరెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు కె.రాజిరెడ్డి, మండల కోప్షన్ ఖాజా పాషా, పిఏసిఎస్ ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు రాజ్ గోపాల్ చారి, ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, డైరెక్టర్ జాకటి వెంకటయ్య, డిసియంఎస్ మేనేజర్ వెంకట్రాంరెడ్డి, రైతులు, డిసియంఎస్ గోడౌన్ ఇంచార్జి రవి బాబు తదితరులు పాల్గొన్నారు.