కరోనా రోజుల్లో కనికరించండి.

Published: Wednesday April 28, 2021
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : జూలూరుపాడు మండల బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ మండలంలో అర్హులు అయిన అటువంటి వృద్ధులు వితంతువులు వికలాంగులు ఎందరో అభాగ్యులు ఎం డి ఓ ఆఫీస్ లో ప్రభుత్వ పింఛన్ స్ కోసం దరఖాస్తులు చేసుకొని ఎదురుచూపులు చూస్తున్నారు వీరి పరిస్థితి ఇంట్లో ఉంటే కరువు కాలు బయట పెడితే కరోనా ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న అటువంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి అనే పరిస్థితుల్లో వీరు ఉన్నారు వీరి దీన పరిస్థితి గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పింఛన్లు పక్రియ జారీ చేయాలని కోరడం జరిగినది భారతదేశంలోనే మొట్టమొదట వృద్ధులకు వితంతువులకు రెండు వేల రూపాయలు వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిది అలాంటి ప్రభుత్వం ఈ కరోనా పరిస్థితులలో పింఛన్ లబ్ధిదారులకు నెలల కొద్దీ పింఛన్లు ఆపటం కరెక్ట్ కాదు అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు నీలాల జానికమ్మ వీరభద్రం ఆకులమ్మ తదితరులు పాల్గొన్నారు