గుండా మల్లేష్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి : మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి

Published: Thursday September 09, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ జీవితాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకొని అనుసరించాలని మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి అన్నారు. బుధవారం నాడు గుండా మల్లేష్ ప్రథమ వర్ధంతి సందర్భంగా స్థానిక సింగరేణి కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నప్పుడు తాను ఎన్నడూ ఆడంబరాలకు పోలేదని మామూలుగా ప్రజలతో మమేకమై నిత్యం ప్రజల సమస్యల సాధన కోసం ఎంత రాత్రి వరకైన ఉండి సమస్యల సాధన కోసం పోరాడే వాడని, తనకంటూ ఎలాంటి ఆస్తులు సంపాదించుకున్న ప్రజల కోసమే పాడుపడ్డ నిస్వార్థ సేవా భావం గలవాడని, ప్రజాప్రతినిధులందరూ ఆయన అనుసరించిన మార్గాలను అలవాటు చేసుకుని ఆచరించాలని ఆమె అన్నారు.