రెప్పపాటు నిర్లక్ష్యం కరీదు నిండు ప్రాణం మంచిర్యాల ట్రాఫిక్ ఎస్ఐ. విజయ్.

Published: Thursday September 23, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్22, ప్రజాపాలన : వాహనం నడిపేటప్పుడు రూల్స్ బ్రేక్ చేయకూడదని, రెప్పపాటు నిర్లక్ష్యం కరీదు నిండు ప్రాణం కోల్పోవలసి వస్తుందని మంచిర్యాల ట్రాఫిక్ ఎస్ఐ. విజయ్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ గౌరవ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ (డిఐజి) గారి ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఏసిపి బాలరాజు గారి సూచనలతో బుధవారం జిల్లా కేంద్రంలో ని వాహప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, కళాశాలకు వాహనాలపై వచ్చే విద్యార్థులు అందరూ తప్పకుండా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపరాదని, ఇది చట్టరీత్యా నేరం అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించాలని, అతి వేగంగా తమ వాహనాలు నడుపరదని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ ట్రాఫిక్ సిబ్బంది, దాదాపు 200 విద్యార్థులు, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.