ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కటుకం గణేష్ కు కరోనా వారియర్ అవార్డు

Published: Thursday May 20, 2021
 కోరుట్ల, మే 19, (ప్రజాపాలన ప్రతినిధి) : ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో సమాజానికి సేవలు చేస్తున్న వారిని గుర్తించి కరోనా వారియర్ అవార్డు లను ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సామజిక వేత్త రక్తదాన అనుసంధాన కర్త కటుకం గణేష్ చేసిన సేవలను ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్అసోసియేషన్ వారు గుర్తించి ఈ అవార్డు ను ఇవ్వడం జరిగింది ఇట్టి అవార్డు ను కోరుట్ల అర్ డి ఓ వినోద్ కుమార్ చేతుల మీదుగా బుధవారం రోజున ఆర్ డి ఓ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది అవార్డు అందుకున్న గణేష్ కు ఆర్ డి ఓ వినోద్ కుమార్ శాలువాతో సన్మానించారు ఆర్ డి ఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ కటుకం గణేష్ చేసిన సేవలను గుర్తించి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన కరోనా వారియర్ అవార్డు అందుకోవడం గర్వించదగ్గ విషయం అని సామజిక సేవలో ముందుండి ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని రక్తదాత అనుసంధాన కర్త గా ఉంటూ యువతలో ఉన్నా రక్తదానం పై ఉన్నా అపోహలను తొలగించి ఎందరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వారికి రక్తదానం చేపియడం చాలా గొప్ప విషయం అని ఈ లాంటి సామజిక సేవలు మరిన్ని చేయాలని ఇంకా ఇలాంటి అవార్డు మరెన్నో పొందాలని అన్నారు కరోనా వారియర్ అవార్డు గ్రహీత కటుకం గణేష్ మాట్లాడుతూ ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మీడియా కన్వీనర్ వంకాయల కార్తీక్ సభ్యులు వేమన్ కుమార్ శ్యాం మామిడి, అల్లే గంగాధర్, గరిగే రమేష్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు కటుకం గణేష్ కు చేయూత స్వచ్చందంగా సేవ సంస్థ ప్రతినిధులు వాసాల గణేష్, ఏం డి సానవోద్దీన్, జాల వినోద్ లు శుభాకాంక్షలు తెలిపారు