డయల్ యువర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమానికి విశేష స్పందన.

Published: Friday August 26, 2022
 మధిర రూరల్న్ఆగస్టు 25 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు టి ఎస్ ఆర్ టి సిమధిర డిపో నందు జరిగిన డయల్ యువర్ డి. యం. కార్యక్రమం నందు ప్రయాణికులు మరియు పరిసర ప్రాంత ప్రజల నుండి విశేష స్పందన వచ్చినది. ఈ కార్యక్రమం లో అధిక శాతం మంది ప్రజలు మధిర నుండి నందిగామ కు అదనపు ట్రిప్పులు నడపమని కోరినారు.దానికి డిపో మేనేజర్  ప్రయాణికుల అవసరానికి అనువైన సమయంలో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామననితెలియజేసారు.మధిర నుండి శ్రీ రామకృష్ణ  కల్లూరు నందిగామ సర్వీస్ నడుపమని కోరగా త్వరలో తప్పకుండ సర్వీస్ ఏర్పాటు చేస్తామని తెలియజేయడం జరిగింది. పరశురామ్  ఆళ్లపాడు జగ్గయ్యపేట సర్వీస్ నడుపమని కోరగా గతంలో ఆళ్లపాడు బోనకల్ -జగ్గయ్యపేట సర్వీస్ నడపడం జరిగినదని ఆదాయం సరిగా రాని కారణంగా సర్వీస్ నిలుపుదల చేయడం జరిగింది అని తెలిపినారు. శ్రీ. పిశ్రీనివాస రావు మీనవోలు -గోసవీడు సర్వీస్ నడుపమని కోరగా త్వరలో పరిశీలిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమం నందు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తూ టిఎస్ఆర్టిసి మధిర డిపో అభివృద్ధికి ప్రయాణికులు తమ వంతు సహకారం అందిస్తూ అందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించేలాగున తమ వంతు సహకారంఅందిచవలసినదిగా మధిర డిపో మేనేజర్ శ్రీ యస్. దేవదానం  కోరినారు.