యోగా శిక్షను ప్రతి పాఠశాలలో అమలు పరచాలి

Published: Saturday December 17, 2022
* జిల్లా విద్యాధికారిణి జి రేణుకా దేవి
వికారాబాద్ బ్యూరో 16 డిసెంబర్ ప్రజా పాలన : యోగా శిక్షణను ప్రతి పాఠశాలలో అమలు పరచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి జి. రేణుకాదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న యోగ శిక్షణ తరగతుల  ముగింపు సమావేశంలో జిల్లా విద్యాధికారి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ...  యోగా శిక్షణను ప్రతి పాఠశాలలో ఐదు నిమిషాలు యోగ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులందరికీ శిక్షణ ఇవ్వాలని తెలిపారు. యోగా ద్వారా  విద్యార్థులలో శారీరిక మానసిక మనోధైర్యాన్ని కల్పించి వాళ్లు మంచి భావి భారత పౌరులుగా ఎదిగేవిధంగా ప్రోత్సహించాలని తెలిపారు. విద్యలో మంచిగా  రాణించాలని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులందరూ కూడా యోగ నేర్చుకొని రోజు సాధన చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అకాడమీక్ అధికారి జి. రవి మాట్లాడుతూ ఐదు రోజులు తీసుకున్న యోగ శిక్షణను పాఠశాలలో అమలుపరిచి విద్యార్థులకు నేర్పినప్పుడే ఈ శిక్షణ విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ  యోగాను సాధన చేసి  పాఠశాలలలోని విద్యార్థులతో పాటు అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరారు.  శిక్షణను విజయవంతం చేయడంలో సహకరించిన వ్యాయామ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. యోగ సంస్థ డైరెక్టర్ అరుణ  శిక్షణకు విచ్చేసి ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడికి ఉన్న సమస్యలను తెలుసుకొని వాటికి చిట్కాలను వివరించారు.  ఆరోగ్య సమస్యలు ఎలా అధిగమించాలో తెలపడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో  హైదరాబాద్ అరుణ యోగ శిక్షణ సంస్థ  యోగ మాస్టర్లు అశోక్ ,  శివ,  జిల్లాలోని వివిధ పాఠశాల  వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.