షమీమ్ ను ఆదుకున్న ముస్లిం సేవా సమితి..

Published: Monday November 21, 2022
తల్లాడ, నవంబర్ 20 (ప్రజాపాలన న్యూస్):  మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ షమీం కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న  ముస్లిం సేవసమితి ప్రతినిధులు ఆదివారం 11,600 ఆర్థిక సహాయం అందించారు  ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ కమల్, కార్యదర్శి షేక్ గాలిబ్, షేక్ మస్తాన్, షేక్ నిజం ,షేక్ హైమత్, షేక్ షరీఫ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.