దేవలమ్మ నాగారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదు -- సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి

Published: Tuesday September 27, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని మునుగోడు బై ఎలక్షన్ లో గ్రామ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని 
గ్రామ సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రజాపాలన దినపత్రిక పలకరిస్తే వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ గా దేవలమ్మ నాగారం గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తున్నాయని తెలియజేశారు. ముఖ్యంగా నేను సర్పంచ్ గా గ్రామంలో రెండున్నర కిలోమీటర్లు గ్రామ కంఠం ద్వారా సీసీ రోడ్లు నిర్మించామని. గ్రామంలో 50 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగిందని. తెలంగాణ రాష్ట్రంలోనే చెత్తను తీసుకువెళ్లే వాహనాన్ని మొట్టమొదటిగా దేవలమ్మ నాగారంలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు తడి పొడి చెత్త బుట్టలను రాష్ట్రంలోనే మొట్టమొదటగా దేవలమ్మ నాగారంలోనే ఇవ్వడం జరిగిందన్నారు. నేను సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న నాడు గ్రామంలో త్రాగునీరు లేకపోవడంతో గ్రామ చెరువు నుండి 2 కిలోమీటర్ల పైపులైన్ వేసి గ్రామానికి త్రాగునీరును అందించామన్నారు. రైతులు తమ పొలాల వద్దకు వెళ్లడానికి దారి సక్రమంగా లేకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడేవారని 2 కిలోమీటర్ల వరకు రైతులకు తారు రోడ్డు నిర్మించామన్నారు. గ్రామస్తులు అనారోగ్యాల బారిన పడకూడదని 2 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశామన్నారు. అదునాతన సుందరంగా 30 లక్షల రూపాయలు వెచ్చించి గ్రామపంచాయతీ నూతన భవనం
నిర్మిస్తున్నామని తెలియజేశారు. గ్రామ ప్రజలతో నిరంతరం మమేకమై గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. గ్రామంలో 2600 ఓట్లు ఉన్నాయని. అందులో టిఆర్ఎస్ పార్టీగా 1600 ఓట్లు ఉన్నాయని. మునుగోడు బై ఎలక్షన్ లో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి దేవలమ్మ నాగారం ప్రజలు బ్రహ్మరథం పలుకుతారని ఆశిస్తున్నానని తెలియజేశారు.
 
 
 
Attachments area