మల్లాపూర్ మండల టి.ఆర్.యస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

Published: Monday September 20, 2021
మల్లాపూర్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి) : తెరాస కార్యకర్తలు పార్టీకి పట్టు కొమ్మలు, కార్యకర్తలను  కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాది అని కోరుట్ల స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.  మల్లాపూర్ మండల తెలంగాణా రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం మల్లాపూర్ మండల కేంద్రంలోని కె.ఎం.ఆర్ గార్డెన్ లో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్యక్షతన మండల తెరాస నేతలు సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశనికి వందలాదిగా విచ్చేసిన కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు, అభినందనలు తెలుపుతూ,మన పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీని కాపాడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలదేనని, ప్రతి పక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని, సంక్సోభంలోను సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశంలో ఎక్కడా లేని విదంగా రైతు బంధు, దళిత బంధు, రైతు భిమా మరియ ఆసరా పింఛన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వం అని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రామాలలో తెరాస గ్రామ స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గా నియమించి, మండల అధ్యక్షులుగా తోట శ్రీనివాస్ ను ప్రధానకార్యదర్శిగా దేవర సురేష్ రావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కాటిపెల్లి సరోజన ఆదిరెడ్డి, వైస్ ఎంపీపీ గౌరి నాగేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కదుర్క నర్సయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కోమ్మల జీవన్ రెడ్డి, ఎంపిటిసి ఆకుతోట రాజేష్, ఏనుగు రాంరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు నత్తి నర్సయ్య, క్యాతం జీవన్ రెడ్డి, శరత్ గౌడ్, మ్యాకల సతీష్ మండలంలోని ఎంపిటిసిలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.