*వేడి వేడిగా సర్వసభ్యు సమావేశం*

Published: Friday December 16, 2022
చేవెళ్ల: (డిసెంబర్ 15), ప్రజాపాలన :
 
సర్వసభ్య సమావేశం వాడి వేడిగా కొనసాగింది
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ జరిగింది. ఈ సమావేశానికి  సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతుంటే సర్పంచులు ఎంపీటీసీలు అధికారులపై మండిపడ్డారు. గ్రామాలలో రైతులు ధరణి పోర్టల్ వచ్చిన నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ధరణిలో ఉన్న సమస్య క్లియర్ అవ్వాలంటే ఒక ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తే చాలు పొద్దు మూకే వరకు సమస్య క్లియర్ అవుతుందని, ధరణి ఒక పైసల దుకాణమని,స్థానిక ఎమ్మెల్యే చేపట్టిన శుభోదయం కార్యక్రమంలో  గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని తొందరగా పరిష్కరిస్తామని చెప్పి వెళ్లారు కానీ ఎక్కడి సమస్య అక్కడే ఉందంటూ, ఈ సమావేశం జరుగుతుంటే ఈ పెచ్చులూడిన బిల్డింగ్ ఎప్పుడు కూలి మీద పడుతుందోననే భయం ఉందని కొత్త భవనం ఎప్పుడూ ప్రారంభోత్సవానికి నోచుకుంటుందని, సమావేశం పూర్తి కాకముందే ఎమ్మార్వో , వారి సిబ్బంది మధ్యలో నుంచి వెళ్లిపోతే గ్రామాలలో ఉన్న భూ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని, ఐదు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలలోకి ఎందుకు రావడం లేదని ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చి మంచిగున్న పాత పైప్ లైన్లను ఖరాబ్ చేశారని,కొత్త పెన్షన్ లు ఎప్పుడు వస్తాయి గ్రామంలో ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని, సర్పంచులు ఎంపీటీసీలు స్థానిక ఎంపీడీవో,ఎంపీపీ పై మండిపడ్డారు. కొన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు మా ఊరిలో ఎలాంటి సమస్యలే లేవు అన్నట్టుగా సమావేశానికి డుమ్మా కొట్టారు. సమస్యలు ఇంకేమైనా ఉంటే చెప్పండి నోట్ చేసుకుంటామన్న ఎంపీడీవో, గ్రామాలలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని సర్పంచుల సమాచారానికి వెంటనే రిప్లై ఇవ్వాలని అధికారులకు స్థానిక ఎంపీపీ విజయలక్ష్మి రమణ రెడ్డి సూచించారు.