కుట్టుమిషన్ శిక్షణ శిబిరం ను సందర్శించిన ట్రైనీ అధికారులు

Published: Thursday March 18, 2021
వెల్గటూర్, మార్చి17 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా మైనారిటీ శాఖ మరియు ఎన్.ఎ.సి జగిత్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో గత రెండు నెలల నుండి నిర్వహణ జరుగుతున్న ముస్లిం-మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ శిబిరం ను బుధవారం రోజు ట్రైనీ ఐ.ఎ.ఎస్ మరియు ఐ.పి.ఎస్ అధికారులు రశ్మీ, ఓం ప్రకాష్, రమేష్ లు సందర్శించారు. త్రివేణి ఐఏఎస్లు ఐపిఎస్లు శిక్షణ విధానంను మరియు అనంతరం పొందే ఉపాధి, ఆర్థిక అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకుని, శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గెల్లు చంద్రశేఖర్, కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, యం.పి.డి.వో సంజీవరావు, టైలర్ ట్రైనర్ గంగ జల, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.