అధికారులు సైతం పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తీసుకెళ్ళరాదు

Published: Wednesday April 05, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 4 ఏప్రిల్ ప్రజా పాలన : 
పదవ తరగతి పరీక్షలు రెండవ రోజు జరుగుతున్న సందర్భంగా  జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి వికారాబాద్ పట్టణ కేంద్రంలోని న్యూ నాగార్జున ఉన్నత పాఠశాల, ఆలంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తగడి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం సందర్శించారు.  పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వహించే వారు,  పరీక్ష కేంద్రాలను సందర్శించే అధికారులైనప్పటికీ మొబైల్ లను అనుమతించకూడదని పోలీసు అధికారులను, చీఫ్  సూపరింటెండెంట్ లను కలెక్టర్ ఆదేశించారు. ‌   పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్న గదులను   కలెక్టర్ కలియ తిరిగి పర్యవేక్షించారు.