బెల్లంపల్లిలో ఘనంగా సింగరేణి డే ఉత్సవం

Published: Saturday December 24, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో ని శాంతిఖని గని పై, మరియు సింగరేణి ఏరియా ఆసుపత్రి ఆవరణలో సింగరేణి సంస్థ  లోగో తో వున్న జెండాలను ఆవిష్కరించి   ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి డి వై సి ఎం ఓ, డాక్టర్ రామాల  శౌరి మాట్లాడారు, ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఒక్క గొప్ప నానుడని, ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న, చేపట్టిన, తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడానికి ఈరోజు ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి డివిజన్లో సెంట్రల్ ఫంక్షన్ ఏర్పాటు చేసి సంస్థ అభివృద్ధిని, చేపట్టిన కార్యక్రమాలను తెలుపుతూ, ఉత్తమ గనులకు, ఉత్తమ అధికారులకు, ఉత్తమ కార్మికులకు, ఉత్తమ క్రీడాకారులకు, ఉత్తమ ఏరియాలకు బహుమతి ప్రధానం చేస్తూ మరింత సంస్థని అభివృద్ధి బాటలో నడిపించడానికి కృషి చేయడానికి సంస్థ అధికారులు తగిన సూచనలు, సలహాలు, ఇచ్చి సంస్థ అభివృద్ధి బాటలో పయనించడానికి, సంస్థ తరఫున వివిధ స్టాల్ ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తారని  అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.