సింగరేణి కార్మికుల 11వ వేతన ఒప్పందం 50% పెరుగుదలతో వెంటనే ప్రకటించాలి టిఎన్టియుసి, ప్రధాన కార్

Published: Tuesday November 29, 2022
బెల్లంపల్లి నవంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి కార్మికులకు రావలసిన 11వ వేతన ఒప్పందం 50% పెరుగుదలతో వెంటనే ప్రకటించాలని, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి, మణి రామ్ సింగ్ అన్నారు.
సోమవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ద్వార సమావేశంలో కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు,
11వ వేజ్ బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు కనీసం 50 శాతం పెరుగుదలకు జె బి సి సి ఐ, జాతీయ సంఘాలు, సింగరేణి యాజమాన్యం, కోలిండియాపై ఒత్తిడి పెంచి  వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
 ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణలను సింగరేణిలో నిషేధించాలని, సింగరేణి కార్మికులపై ఆదాయపు పన్ను రద్దు చేయాలని, అలవెన్సుల పై పన్ను సి ఐ ఎల్ లో మాదిరిగా చెల్లించాలని, కార్మికులకు నష్టం జరిగేలా తీసుకువచ్చిన   కొత్త కార్మిక చట్టాలను, లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని అన్నారు.  పదిలక్షలపై సవరించిన గ్రాట్యుటి  ప్రకారం పెండింగ్ బకాయిలు 2016 జనవరి నుండి చెల్లించాలని, ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి, ఒకటవ క్యాటగిరి వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.  గనులలో  బొగ్గు ఉత్పత్తి చేసే వివిధ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్ కు ఇచ్చే పద్ధతిని మానుకోవాలని, సింగరేణిలోసంస్థలో పనిచేస్తున్న కార్మికులకు సొంత ఇంటి పథకం లో భాగంగా జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలంతో పాటు,  యాభై  లక్షల వడ్డీ లేని రుణం సదుపాయం కల్పించాలని, ఎస్ఆర్పి మూడవ గనిలో ప్రమాదంలో మరణించిన కృష్ణారెడ్డి, సత్యనారాయణ రాజుల, వారసులకు బేషరతుగా ఉద్యోగాలు ఇవ్వాలని, పెసర కుంట వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన సింగరేణి రెస్క్యూ కార్మికులకు బేశరత్ గా రెండు కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
గత  గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా  ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం  15 భూగర్భ గనులు,  తెరిపించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పిన హామీలను వెంటనే నెరవేర్చాలని,  పదవి విరమణ పొందిన కార్మికులకు అదే రోజున టర్మినల్ బెనిఫిట్స్ అందజేయాలని, అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు టిడిపి హయాంలో ఒక్క  పైసా తీసుకోకుండా 30 వేలమంది నిరుద్యోగులకు పరుగు పందెం ద్వారా ఉద్యోగాలను కల్పించిన ఘనత టిడిపిదని,  సింగరేణి బి ఐ ఎఫ్ ఆర్ లోకి వెళితే 1263 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పుగా తీసుకువచ్చి  663 కోట్ల రూపాయల రుణం మాఫీ చేయించి సింగరేణిని లాభాల బాటలోకి తీసుకువచ్చింది నారా చంద్రబాబు నాయుడని, సింగరేణిలో మొట్టమొదటిసారిగా లాభాల వాటా  ఇచ్చిన ఘనత కూడా టిడిపిదే అని అన్నారు.
 రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిఎన్టియుసిని  గెలిపిస్తే సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ నుండి రక్షిస్తామని అన్నారు.      
ఈ సమావేశంలో టీ, మణి రామ్ సింగ్, జి, నారాయణ, బొల్లు మల్లయ్య, జి సదానందం, హరికిషన్ పాండే, ఆర్, గంగాధర్ గౌడ్, బి,మధునయ్య, కాసర్ల వెంకటేష్, ఎండి, హసన్, వెంబడి రాములు, ఆస్పత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.