ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రవికుమార్

Published: Wednesday December 08, 2021
మేడిపల్లి, డిసెంబర్ 7 (ప్రజాపాలన ప్రతినిధి) : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్ లో ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా తెరాస సీనియర్ నాయకులు గడ్డం రవికుమార్ ఎంపీ సంతోష్ కుమార్ ను ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి  బహుమతిని అందజేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో గడ్డం రవికుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు క్రిష్ణారెడ్డి, గరిక సుధాకర్, డీజే సాయి, లేతాకుల రఘుపతిరెడ్డి, నరసింహారెడ్డి రామంతాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎండీ. ముస్తాక్ లతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.