కుక్కల దాడి నుండి కాపాడండి. .. విబిఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్

Published: Thursday February 23, 2023
జన్నారం, ఫిబ్రవరి 22, ప్రజాపాలన: కుక్కల దాడి నుండి వృద్ధులు చిన్నారులు మూగజీవులను కాపాడండిని బుధవారం తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువజన సంఘం వంచిత్ బహుజన్ ఆగాడి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని పలు గ్రామాలలో కుక్కల స్వరం విహారం వినిపిస్తున్నాయని గతంలో కవ్వాల్ గ్రామానికి చెందిన ఒక మహిళను కుక్కలు కలవడంతో కాలుకి తీవ్ర గాయాలైయన్నారు. దీంతో మండలంలోని ప్రజలు వృద్ధులు  ప్రధాన రహదారిపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే కుక్కల వలన భయభ్రాంతులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు ఏదో ఒక గ్రామములో మండల కేంద్రాలలో పట్టణాలలో మనుషుల పైన మూగజీవుల పైన కుక్కలు చిన్న పెద్ద తేడ లేకుండ మీద కొరికి కరుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.  గ్రామాలలో సర్పంచులు, మండల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకుండా చూచిచూడ న్నట్టుగా వివరిస్తున్నారని ఆయన వాపోయారు. కుక్కలను పెంచుతున్న యజమానులు వాటిని ఇంటిలో కట్టి ఉంచుకోనే విధంగా  ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టం తెచ్చి కుక్కను ఎవరు సాధిన ఆ కుక్కతో ఎవరికి ప్రమాదం జరిగిన వారినే బాద్యులుగా చేయాలన్నారు.  గ్రామాలలో ఉన్న వీది  కుక్కలను అరికట్టాలని కక్కులు ఎవరిని కరిచిన ఆ గ్రామ సర్పంచ్ ను  అధికారిని పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సలర్ లాలు భార్డు సభ్యులను ఎం ఎల్ ఏ, ఎం పి, లను కింది నుంచి పై వరకు అధికారులను బాద్యులు గా చేయాలన్నారు. ప్రభుత్వం పూర్తీ బాధ్యత వహించాలని ఆయన కోరారు.
  ఒకవేళ కుక్కలు ఎవరిని కరిచిన స్థానిక సర్పంచ్ అధికారులు ప్రజాప్రతినిధులు పెంచిన యజమానులను బాద్యులుగా చేస్తూ నష్టపరిహారంతో పాటు వారిపై కేసులు బుక్ చేసి కఠినంగా శిక్షించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అదేవిధంగా హైదరాబాదులోని బాగ్ అంబర్పేట్ కాలనీకి చెందిన ప్రదీప్ (4) కుక్కల దాడిలో మృతిన కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన కోరారు.