హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి

Published: Thursday June 17, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 16 ప్రజాపాలన బ్యూరో : మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎన్నేపల్లి వరకు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగాా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎఫ్ఏఓ (ఫుడ్ & అగ్రికల్చర్ ఆర్గనైజేషన్)  హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ వరల్డడగా గుర్తించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను పట్టణాలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. హరితహారం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. హరితహారంలో నాటిన మొక్కల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నాటిన మొక్కలు రక్షించడంలో అధికారులు ప్రజాప్రతినిధుల కలిసి ప్రత్యేకమైన ప్రణాళిక రూపోందించుకోవాలన్నారు. వర్షాకాలంలో ఎక్కువగా ఈదురుగాలులతో విరిగిన లేదా వంగిన మొక్కలను వెంటనే సరి చేయాలన్నారు. రానున్న విడత హరితహారంలో పట్టణ ప్రాంతంలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్, పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు షకీల్ ఏ ఈ రాయుడు, నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.